తాము చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు జపాను బౌద్ధ సన్యాసులు రాసిన కవితలు యివి. 1999 లో
Allan Graham వీటిని యింగ్లీష్ లోకి అనువందించాడు.
వదలిపోతున్నాను
నిలబడుతూ , కూర్చుంటూ
యెముకల పేర్పు
లేస్తూ తేలుతూ పడిపోతూ
సముద్రంలో వురుమునై
వదలిపోతున్నాను
నిలబడుతూ , కూర్చుంటూ
యెముకల పేర్పు
లేస్తూ తేలుతూ పడిపోతూ
సముద్రంలో వురుమునై
Koho Kennichi – మరణం 1316, వయస్సు 76
..................................................
ఖాళీగా వచ్చాను
ఖాళీగా వెళ్ళిపోతాను
రావడం పోవడం
సంక్లిష్టమయిపోయిన సాదా విషయాలు
..................................................
ఖాళీగా వచ్చాను
ఖాళీగా వెళ్ళిపోతాను
రావడం పోవడం
సంక్లిష్టమయిపోయిన సాదా విషయాలు
Kozan Ichiko – మరణం 1360 వయస్సు 77
..................................................
జీవితం మబ్బులు మంచు
గుహనుండి బయటికొస్తూ
విశ్వ కదలిక మీద ప్రతిఫలించే
వెన్నెలే- మృత్యువు
దాని గూర్చి యెక్కువ ఆలోచిస్తే
యెప్పటికీ విఛిన్నమవుతుంటావు
..................................................
జీవితం మబ్బులు మంచు
గుహనుండి బయటికొస్తూ
విశ్వ కదలిక మీద ప్రతిఫలించే
వెన్నెలే- మృత్యువు
దాని గూర్చి యెక్కువ ఆలోచిస్తే
యెప్పటికీ విఛిన్నమవుతుంటావు
Mumon Gensen - మరణం 1390 వయస్సు 68
.............................................
జీవిత పరిమళాల్ని రుచి చూస్తూ
డెబ్భై యేళ్ళు
మూత్ర దుర్గంధంతో యెముకలు
యిప్పుడిక యేదయితే యేంటి
చూడిలా -యెక్కడికి తిరిగెల్తున్నా
శిఖరం మీద వెన్నెల
తేటగా వీస్తున్న గాలి
రోగ యాత్ర
పురా భూముల మీదుగా
పగిలిన కలలు

Tosui – మరణం 1683 వయస్సు 70
..................................................
..................................................
రోగ యాత్ర
పురా భూముల మీదుగా
పగిలిన కలలు
Basho –మరణం 1694 వయస్సు 51
.............................................
నేను రాస్తాను
వికసితాల్ని తుడిచేస్తాను
మళ్ళీ వికసిస్తాయి
.............................................
నేను రాస్తాను
వికసితాల్ని తుడిచేస్తాను
మళ్ళీ వికసిస్తాయి
Hokushi – మరణం 1718 వయస్సు ?
..................................................
పువ్వులు గాలిని పట్టుకుంటాయి
సత్యం స్వేచ్చగా సుడులు తిరుగుతుంది
పక్షి పాట
..................................................
పువ్వులు గాలిని పట్టుకుంటాయి
సత్యం స్వేచ్చగా సుడులు తిరుగుతుంది
పక్షి పాట
Gozan – మరణం 1733 వయస్సు 38
..................................................
జననం -స్నానించాను
మరణం -మళ్ళీ స్నానించాను
అర్థంలేని మార్మికత
..................................................
జననం -స్నానించాను
మరణం -మళ్ళీ స్నానించాను
అర్థంలేని మార్మికత
Issa – మరణం 1827 వయస్సు 65
..................................................
ప్రవహిస్తున్న గాలి
భగ్న గర్వాన్ని వీడి
వెళ్ళిపోతున్నది నా చివరి కలయేనా
..................................................
ప్రవహిస్తున్న గాలి
భగ్న గర్వాన్ని వీడి
వెళ్ళిపోతున్నది నా చివరి కలయేనా
Kyo’on – మరణం 1749 వయస్సు 63
..................................................
పొడవాటి కల
నిడివి లేని నిదురలోంచి
మేలుకొంటూ
..................................................
పొడవాటి కల
నిడివి లేని నిదురలోంచి
మేలుకొంటూ
Yayuu – మరణం 1783 వయస్సు 82
..................................................
మొదటికి ముందు
వొంటరి -శాంతి యెరుకతో మృత్యువు
సూర్యుడిలోకి కరుగుతోన్న
మంచు ముద్ద-జీవితం
..................................................
మొదటికి ముందు
వొంటరి -శాంతి యెరుకతో మృత్యువు
సూర్యుడిలోకి కరుగుతోన్న
మంచు ముద్ద-జీవితం
Nandai – మరణం 1817 వయస్సు 31
..................................................
వికసితాలు కూలుతాయి
పూల ప్రపంచంలో
దేహం
..................................................
వికసితాలు కూలుతాయి
పూల ప్రపంచంలో
దేహం
Kiko – మరణం 1823 వయస్సు 52
..................................................
యిప్పుడిది-యిప్పుడది
పడిపోతూ
గాలిని దారి మళ్ళించింది
..................................................
యిప్పుడిది-యిప్పుడది
పడిపోతూ
గాలిని దారి మళ్ళించింది
Ryokan – మరణం 1831 వయస్సు 74
..................................................
వస్తున్నదానికి వస్తున్నదే తెలుసు
పొతున్నదానికి పోతున్నదే తెలుసు
పడిపోతున్న దాని అంచుల్ని పట్టుకోడమెందుకు
స్వేచ్చగా తేలుతూ మబ్బులు
గాలి యెక్కడ దెబ్బ కొడుతుందో
యెప్పటికీ తెలియదు

Sengai Gibon – మరణం 1837 వయస్సు 88
స్వేచ్చానువాదం: దాము
స్వేచ్చానువాదం: దాము