వొక పురాతన కాలం నుంచి
యిక్కడే జీవిస్తున్నాను
శాపగ్రస్త రాక్షసుడివలె
భూమిని భుజాల మీద మోస్తున్నాను
నా నీడ మీదే నడుస్తున్నాను
అనేక మరణాల పొడవునా
తీవ్ర వాంఛ వొకటే బతుకుతోంది
అనేక భ్రమల మధ్య
దుఖం వొకటే నిలుస్తోంది
అనేక మనిషి పొరల మధ్య
జంతువొకటే కదులుతోంది
నా దుఖపు కోరికల్ని ఆకాశం ఆవహించాక
సమస్త నీతుల్నీ ధిక్కరించి
సమస్త జన్మల్నీ నిరాకరించి
నా తొలి తల్లి గర్భం లోకి నేను
తిరోగమిస్తాను
---25.01.2012
ఉదయం 9.15
అనేక మరణాల పొడవునా
ReplyDeleteతీవ్ర వాంఛ వొకటే బతుకుతోంది manishi eppudoo anthenemo anipisthondi
మానవ నైజం....
ReplyDeleteఅదే నగ్నసత్యం...