Wednesday, January 25, 2012

మరణం లేని చీకటి లోకి

వొక పురాతన కాలం నుంచి 
యిక్కడే జీవిస్తున్నాను 
శాపగ్రస్త రాక్షసుడివలె 
భూమిని భుజాల మీద మోస్తున్నాను 
నా నీడ మీదే నడుస్తున్నాను 
అనేక మరణాల పొడవునా 
తీవ్ర వాంఛ వొకటే బతుకుతోంది 
అనేక భ్రమల మధ్య 
దుఖం వొకటే నిలుస్తోంది
అనేక మనిషి పొరల మధ్య
జంతువొకటే కదులుతోంది
నా దుఖపు కోరికల్ని ఆకాశం ఆవహించాక
సమస్త నీతుల్నీ ధిక్కరించి 
సమస్త  జన్మల్నీ నిరాకరించి 
నా తొలి తల్లి గర్భం లోకి నేను 
తిరోగమిస్తాను


                                                                                             ---25.01.2012
                                                                                                 ఉదయం 9.15

                                                                                               
 



Friday, January 6, 2012

SHE THAT I AM NOT


leaving all my intellect i rediscover my soul...




Her body fragrance
Envelops onto me like a spider’s web
Leaving all my intellect I
Rediscover my soul
Hid beneath umpteen traces
The magic touch of her skin
Awakened the cells in me
Like the shadow of the
Passionate sky on the earth
I take her with all my life’s
Secret desire into me
When her mystique oceanic beauty
Conquered me
History inside me flowing from times
Dies
I take an ancient body
And open my eyes in a primordial cave
Unacquainted illusions of deceptions, cheat, morals
Shine like stars on the sky afar
But I
On every tree in my valley
Bloom as all nudity………………………………..telugu original : daamu eng trans:jagathi                                             12.12pm Wednesday published in MUSE INDIA E -JOURNAL 

Thursday, January 5, 2012

నేను కాని ఆమె

నాలోపలి  రక్తకణాల్ని మేల్కొలిపిన ఆమె మాంత్రిక స్పర్శ...


ఆమె దేహపు పరిమళం 
సాలె గూడులా నా మీదికి అల్లుకుంటుంది 
నేను సమస్త తెలివినీ వదలి పెట్టి 
అనేక పొరల మాటున దాగిన నా ఆత్మను 
పునః కనుగొంటాను 
నా లోపలి రక్త కణాల్ని మేల్కొల్పిన 
ఆమె మాంత్రిక స్పర్శ.
నేల మీదికి పెనవేసుకునే 
ఆకాశపు మోహపు నీడలా
నేను ఆమెని నా సమస్త జీవితపు 
రహస్య కాంక్షతో నాలోకి  తీసుకుంటాను .
సముద్రం వంటి ఆమె నిగూఢ సౌందర్యం
నన్ను ఆక్రమించినపుడు 
కాలాలుగా  ప్రవహించిన నాలోపలి చరిత్ర
మరణిస్తుంది 
నేనొక పూర్వ దేహాన్ని ధరించి 
వొక  ఆదిమ గుహలో కళ్ళు తెరుస్తాను.
మాయల , మోసాల,నీతుల అపరిచిత భ్రమలు
సుదూరపు గగనంలో చుక్కలవలె మెరుస్తుంటాయి
నేను మాత్రం 
నాలోయ లోపలి  ప్రతి చెట్టు మీద 
బిత్తలిగా పుష్పిస్తాను 
..............................................దాము 5/10/2011   2am (home Hyderabad)