జీర్ణ పర్ణ శాల వేపుగా గొడుగు పట్టుకుని ఎవరు వచ్చేటట్లు లేదు ... |
కాలం ఎడారిలో జ్ఞాపకం
ఒంటె నడిచిపోయిన గుర్తులు మినహా
ఏమీ మిగిలేటట్లు లేదు
ఎవరూ వచ్చేటట్లు లేదు
ఏమీ జరిగేటట్లు లేదు
అమెజాన్ నదిలా వంకర్లు తిరిగిన ఆలోచన
ఏ నాగరికతనూ ఆహ్వానించేటట్లు లేదు
రాయలసీమ నెర్రెలు వారిన భూమి మీద
ఏ వర్షం కురిసేటట్లు లేదు
చూచినంత మేర డ్రైలాండ్ విస్తీర్ణపు దుమ్ము
ఇప్పట్లో మణిగేటట్లు లేదు
ఎవరూ వచ్చేటట్లు లేదు
ఏమీ జరిగేటట్లు లేదు
అమనిషత్వపు ఆకాశం నుంచి
అబద్ధాల కుండపోత వర్షంలో
తడుస్తున్న ఈ జీర్ణ పర్ణశాల వేపుగా
గొడుగు పట్టుకుని ఎవరు వచ్చేటట్లు లేదు
తడి తగిలేటట్లు లేదు
ఏమీ జరిగే జరిగేటట్లు లేదు
("ప్రవాహ గానం" నుండి )
nirjala hrudaya ghosha.....super like
ReplyDelete