పాద ముద్రలు చెదురుతాయి
గతాన్ని వెంట తీసుకుని
వృత్తంలో నడుస్తావు
సమూహాలు లేని వొంటరి కాలం
నీ లోపలి నుంచి లోపలికి
ద్రవిస్తుంటుంది
నీకు నువ్వు మిగులుతావు
క్రమ్ముకునే శూన్యమయినా
మెరిసే చిరునవ్వు జ్ఞాపకమయినా
నీకు నువ్వు దొరుకుతావు
వంద గొంతుల సెల్ ఫోన్
సంభాషణల తర్వాత
నీ రహస్య గొంతు
నీకు మాత్రమే వినిపిస్తుంది.
---11.06.2007
---11.06.2007
మీ కవిత్వమే ఒక ప్రవాహం ఒకసారి ప్రవాహం లో మునిగి ఆస్వాదిస్తే ఎప్పటికీ చెరగని అనుభూతే
ReplyDeleteyeah! rightly said :-)
ReplyDeletehttp://vijayabhanukote.wordpress.com