Saturday, October 22, 2011

వొక ధ్వని

ఇసుక కరుగుతుంది
పాద ముద్రలు చెదురుతాయి 
గతాన్ని వెంట తీసుకుని
వృత్తంలో నడుస్తావు 
సమూహాలు లేని వొంటరి కాలం 
నీ లోపలి నుంచి లోపలికి
ద్రవిస్తుంటుంది 
నీకు నువ్వు మిగులుతావు
క్రమ్ముకునే శూన్యమయినా
మెరిసే చిరునవ్వు జ్ఞాపకమయినా 
 నీకు నువ్వు దొరుకుతావు 
వంద గొంతుల సెల్ ఫోన్
సంభాషణల తర్వాత 
నీ రహస్య గొంతు
 నీకు మాత్రమే వినిపిస్తుంది.
                                                                                    ---11.06.2007


 


2 comments:

  1. మీ కవిత్వమే ఒక ప్రవాహం ఒకసారి ప్రవాహం లో మునిగి ఆస్వాదిస్తే ఎప్పటికీ చెరగని అనుభూతే

    ReplyDelete
  2. yeah! rightly said :-)
    http://vijayabhanukote.wordpress.com

    ReplyDelete